పవర్ స్టార్ సినిమాలో చరణ్..?

అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో హిస్టారికల్ మూవీ ప్లాన్ చేశాడు. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఆ సినిమాకు సంబందించి ఇప్పటికే ఒక చిన్న షెడ్యూల్ పూర్తయిందట. ఈ సినిమాకు విరూపాక్ష టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఉంటుందని తెలుస్తుంది.

సైరా సినిమాలో స్వీటీ అనుష్క చేసిన రుద్రమదేవి పాత్ర లానే చరణ్ పాత్ర కూడా పవన్ సినిమాలో మొదట 10 నిమిషాలు ఉంటుందని తెలుస్తుంది. పవర్ స్టార్ సినిమాలో చరణ్ అనగానే మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు.. దానితో పాటుగా చిరు ఆచార్య సినిమాలో కూడా ఒక రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పవన్ సినిమాలో కూడా చరణ్ నటిస్తున్నాడని తెలియగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.