తనయుడు హీరో.. తండ్రి విలన్.. క్రేజీ మల్టీస్టారర్ అప్డేట్..!

కోలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ గా రాబోతున్న విక్రం, ధ్రువ్ ల సినిమాపై ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ పై అంచనాలు పెంచారు. టాలెంటెడ్ డైరక్టర్ కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కథకు సంబందించిన ఓ న్యూస్ కోలీవుడ్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. విక్రం 60వ సినిమాగా రాబోతున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో విక్రం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట.
ఇక ధృవ్ పాత్ర చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని అంటున్నారు. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మతో పాస్ మార్కులు తెచ్చుకున్న ధృవ్ సెకండ్ ప్రాజెక్ట్ కే తండ్రి సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక తనయుడికి హిట్ ఇచ్చే ఉద్దేశంతో కార్తిక్ సుబ్బరాజుతో అడిగి మరి ఈ సినిమా చేస్తున్నాడు విక్రం. చియాన్ విక్రం ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది రిలీజ్ అయ్యాక గాని తెలుస్తుంది.