చిరు సినిమాలో ఖుష్బు

ఈ వయసులో కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి సైరాతో సత్తా చాటిన చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను కొరటాల శివ డైరక్షన్ లో ఆచర్య అంటూ రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది. 2021 జనవరిలో ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో చిరు నటిస్తారని తెలిసిందే.

సాహో డైరక్టర్ సుజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిన ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో అలనాటి అందాల తార ఖుస్భు నటిస్తుందని తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో నిన్నటితరం తారగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఖుష్బు ప్రస్తుతం సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. చిరు లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి చెల్లి పాత్రలో ఆమె నటిస్తారని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ కు అక్కగా ఖుష్బు నటించారు.