
యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ తనయురాలు శివాని హీరోయిన్ గా మొదటి సినిమా 2 స్టేట్స్. అడివి శేష్ హీరోగా అట్టహాసంగా మొదలైన ఆ సినిమా ఎందుకో అటకెక్కేసింది. ఇక కొద్దిపాటి గ్యాప్ తో శివాని హీరోయిన్ గా ఓ క్రేజీ మూవీ మొదలైంది. మల్లిక్ రాం డైరక్షన్ లో చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జా హీరోగా చేస్తున్న అద్భుతం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది శివాని. సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమా నుండి శివాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
బిల్డింగ్ మీద కూర్చుని చందమామన్ అందుకుంటున్నట్టుగా శివాజి లుక్ బాగుంది. చెల్లి శివాత్మిక దొరసాని సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. మరి శివాని శివాత్మిక కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాతో పాటుగా గరుడవేగ సీక్వల్ లో కూడా శివాని నటిస్తుందని తెలుస్తుంది.