ప్రకాశ్ రాజ్ కూడా అందుకు రెడీ

రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడప్పుడే సినిమా థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. అందుకే ఈమధ్య ఓటిటిల సందడి బాగా వినిపిస్తుంది. మీడియం రేంజ్ అంతకన్నా తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలు అన్ని ఓటిటి రిలీజ్ బాట పడుతున్నాయి. ఇక ఈ గ్యాప్ లో కొందరు స్టార్స్ కూడా డిజిటల్ ఫ్లాట్ మీద నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వరుస సినిమాలు చేస్తున్నా వెబ్ సీరీస్ లకు వస్తున్న రెస్పాన్స్ చూసి వారు కూడా అందులో నటించాలని అనుకుంటున్నారు.

ఇప్పటికే సమంత లాంటి సౌత్ స్టార్ హీరోయిన్ కూడా వెబ్ సీరీస్ చేస్తుండగా లేటెస్ట్ గా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా వెబ్ సీరీస్ ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసే ప్రకాశ్ రాజ్ వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మారుతున్న కాలాన్ని బట్టి నటులు కూడా మారాల్సిందే అంటే ఇదేనేమో. ప్రకాశ్ రాజ్ వెబ్ సీరీస్ లు చేయడం మొదలుపెడితే ఆయన కోసం కొత్త కథలు రాయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.