నాగ చైతన్య సినిమాలో సమంత కండీషన్..!

అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస హిట్లతో కెరియర్ లో మంచి జోష్ కనబరుస్తున్నాడు. లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో అలరించిన చైతు ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత విక్రం కె కుమార్ డైరక్షన్ లో నాగ చైతన్య సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఇప్పటికే కథా చర్చలు ఓకే కాగా.. సినిమాకు థ్యాంక్యూ అని టైటిల్ ఫిక్స్ చేశారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచనలో ఉండగా విక్రం కుమార్ కు సమంత పేరు సజెస్ట్ చేశాడట చైతు. సజెస్ట్ చేయడమే కాదు కచ్చితంగా సమంతను పెట్టుకోవాల్సిందే అనే కండీషన్ పెడుతున్నాడట. సినిమా చేస్తుంది సొంత బ్యానర్ లోనే కాగా సమంత హీరోయిన్ గా తీసుకుంటే బడ్జెట్ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఆల్రెడీ ఏమాయ చేసావే నుండి మజిలీ వరకు ఒక్క ఆటోనగర్ సూర్య తప్ప చైతు, సమంత కలిసి నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి.