రష్మిక ఓన్లీ ఫర్ స్టార్స్..?

కన్నడ భామ రష్మిక మందన్న టాలీవుడ్ లో ఏ ముహుర్తాన అడుగుపెట్టిందో కాని అమ్మడి లక్ మాములుగా లేదు. చేసిన ఐదారు సినిమాలకే తెలుగులో టాప్ రేంజ్ కు వెళ్లిన రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోలకు ఫస్ట్ ఆప్షన్ గా మారింది. ఈ ఇయర్ ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో రాబోతున్న పుష్ప సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది. 

ఇక ఇప్పుడు రష్మిక తను కేవలం స్టార్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటానని చెబుతుందట. యువ హీరోల సినిమాలు ఏవైనా వస్తే తన దాకా రాకుండానే డేట్స్ ఖాళీ లేవని చెప్పి పంపించమని తన మేనేజర్ తో చెబుతుందట రష్మిక. తెలుగులో ఆమె క్రేజ్ తెచ్చుకుంది యువ హీరోల సినిమాలు చేసే.. అలాంటి యువ హీరోలకు ఇప్పుడు ఆమె నో చెబుతుందట. స్టార్ సినిమా అయితే భారీ రెమ్యునరేషన్ ఉంటుందని ఆమె వాటికి మాత్రమే ఓకే చెబుతుందట. మరి రష్మిక మీద వస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజమో తెలియదు కాని ఆమె కనుక ఇలా ఆలోచిస్తే ఫ్యూచర్ లో ఇబ్బంది పడక తప్పదని చెప్పొచ్చు.