బంగారు బుల్లోడు టీజర్.. అల్లరి నరేష్ బ్యాక్ టూ ఫాం..!

అల్లరి నరేష్ హీరోగా గిరి డైరక్షన్ లో వస్తున్న సినిమా బంగారు బుల్లోడు. బాలకృష్ణ సినిమా టైటిల్ పెట్టుకుని వస్తున్న అల్లరోడు మళ్లీ ఈ సినిమాలో తన మునుపటి ఎనర్జీని చూపిస్తాడని అనిపిస్తుంది. నందిని నర్సింగ్ హోం సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన గిరి తన సెకండ్ మూవీని అల్లరి నరేష్ తో సూపర్ హిట్ టైటిల్ తో చేశాడు. ఇక మంగళవారం అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ చేశారు.

బ్యాంక్ లో పనిచేసే అల్లరి నరేష్ తమ బ్యాంక్ లాకర్ లో గోల్డ్ దాచిపెట్టే వాటిని అమ్మేసి క్యాష్ చేసుకుంటాడు. తన కామెడీ టైమింగ్, తన కొత్త ఎనర్జీ చూస్తుంటే అల్లరి నరేష్ బంగారు బుల్లోడుతో హిట్ ట్రాక్ ఎక్కేలా ఉన్నాడు. ఈమధ్య కెరియర్ లో సక్సెస్ లు లేక చాలా వెనుకపడ్డ అల్లరి నరేష్ బంగారు బుల్లోడు, నాంది సినిమాలతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.