ఒక్క ఎపిసోడ్ కు 7 లక్షలా..?

అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ కు పోటీ ఇచ్చేందుకు ఆహా కూడా కొత్త కాన్సెప్టులను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అల్లు అరవింద్ మెగా ప్లాన్ తో ఓ క్రేజీ చిట్ చాట్ షో ఏర్పాటు చేస్తున్నారట. ఈ షోకి మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్ గా చేస్తుందని తెలుస్తుంది. సెలబ్రిటీస్ తో స్పెషల్ చిట్ చాట్ ఇదివరకు షోలకు భిన్నంగా ఈ షో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ షోకి గాను తమన్నా ఒక్క ఎపిసోడ్ కు 7 లక్షల దాకా ఇస్తున్నారని తెలుస్తుంది. 

దశాబ్ధకాలంగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా ఇప్పటికి మంచి ఫాం లో ఉంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఆహా కోసం స్పెషల్ షో చేస్తుంది. ఈ షో మొదటి ఎపిసోడ్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లలో ఒకరు గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది. మరి తమన్నా హోస్ట్ చేస్తున్న ఈ షో ఎలా ఉండబోతుంది.. ఇంతకీ ఈ షో కాన్సెప్ట్ ఏంటన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.