
ఇన్నాళ్లు కామెడీ హీరోగా గుర్తిపు తెచ్చుకున్న అల్లరోడు ఇప్పుడు సీరియస్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. అల్లరి నరేష్ 57వ సినిమాగా రాబోతున్న నాంది టీజర్ కొద్దిగంటల క్రితం రిలీజైంది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. న్యాయం కోసం హీరో చేసే పోరాటమే సినిమా కథ అని తెలుస్తుంది. అల్లరి నరేష్ సినిమా అనగానే కామెడీ కితకితలు పెట్టాల్సిందే. కాని ఈ నాంది తన కెరియర్ కు కొత్త నాంది పలికేలా ఉంది.
ఈమధ్య కెరియర్ లో బాగా వెనుకపడ్డ అల్లరి నరేష్ నాందితో సరికొత్త ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే అల్లరి నరేష్ సీరియస్ గా నటించిన గమ్యం, శంభో శివ శంభో సినిమాఉ ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు నాంది కూడా అల్లరి నరేష్ సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాతో పాటుగా తన రెగ్యులర్ మార్క్ గా వస్తున్న బంగారు బుల్లోడు కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.