
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ గా వస్తున్న సినిమా వకీల్ సాబ్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అనజలి నటిస్తున్నారు. అఫిషియల్ గా కేవలం ఒక పోస్టర్ మాత్రమే రిలీజైన ఈ సినిమా నుండి అన్ అఫిషియల్ లీక్స్ చాలా బయటకు వస్తున్నాయి. అప్పట్లో ఈ సినిమా నుండి ఓ ఫైట్ సీన్ లీక్ అవగా లేటెస్ట్ గా కోర్ట్ సీన్ లో పిక్ ఒకటి లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వకీల్ సాబ్ ఫోటో లీక్ పై నిర్మాత దిల్ రాజు చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. లీక్ చేసిన వారి మీద లీగల్ యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో పోలీస్ కేస్ ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. చిత్రయూనిట్ నుండే ఈ ఫోటో బయటకు వెళ్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పవర్ స్టార్ అత్తారింటికి దారేది సినిమా కూడా అప్పట్లో ఫస్ట్ హాఫ్ మొత్తం లీకై సంచలనం సృష్టించింది. ఇప్పుడు వకీల్ సాబ్ కు సేం సీన్ రిపీట్ అయ్యేలా ఉంది.