నాని 'వి'.. ఆ ఎపిసోడ్ హైలెట్ అట..!

నాచురల్ స్టార్ నాని ఇంద్రంగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమా వి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నాని ఫుల్ లెంగ్త్ నెగటివ్ రోల్ లో నటించగా సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు నటించారు. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నాని మిలిటరీ మేజర్ రోల్ లో కనిపిస్తాడట. సినిమాలో హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో అది ఒకటని. ఆ పాత్ర కోసం నాని చాలా హార్డ్ వర్క్ చేశాడని తెలుస్తుంది. అంతేకాదు థియేటర్ లో ఆ పాత్ర ద్వారా తప్పకుండా నాని ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు.

కెరియర్ లో ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న నాని ఈమధ్య ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇయర్ కు మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ ఫాం కొనసాగిస్తున్న నాచురల్ స్టార్ వి కూడా పక్కా హిట్టు కొడుతుందని అంటున్నారు. సినిమాను ఎలా తీయాలో బాగా తెలిసిన మోహనకృష్ణ నాని విని కూడా చాలా క్లవర్ గా తెరకెక్కించారని తెలుస్తుంది. ఓటిటికి నో చెప్పి లేట్ గా అయినా థియేటర్ లోనే ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తామని చెబుతున్న నాని వి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.