మాహిష్మతిలో ఉన్నా మాస్క్ తప్పనిసరి

కరోనా ప్రభావం ప్రజలకు తెలియచేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు క్రియేటివ్ పీపుల్. లేటెస్ట్ గా యూనిసాఫ్ట్ విఎఫెక్స్ సంస్థ వారు బాహుబలి సినిమాలో ఓ సీన్ లో ప్రభాస్, రానాలు ఫైట్ చేస్తున్న సందర్భంలో ఇద్దరికి మాస్కులను తగిలించారు. బాహుబలి 2లో క్లైమాక్స్ ఫైట్ లో ప్రభాస్, రానా ఎదురెదుగా వచ్చే సీన్ కు వీళ్ల విఎఫెక్స్ ఎఫెక్ట్ ద్వారా వాళ్లిద్దరికి మాస్కులు తగిలించారు. మాహిష్మతిలో ఉన్నా కూడా మాస్క్ తప్పనిసరి అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు.

ప్రస్తుతం కరోనా తీవ్రత దాని ప్రభావం గురించి ఇలా తమకు నచ్చిన విధంగా అభిమాన హీరోల ద్వారా చెబితే ఎక్కువ రీచబులిటీ ఉంటుందని ఇలా ప్లాన్ చేశారు. వెళ్ల క్రియేటివిటీకి రాజమౌళి కూడా గుడ్ జాబ్ అని కామెంట్ పెట్టాడు. అంతేకాదు అందరు ఇంట్లోనే ఉంటూ నిబంధనలు పాటించండి అంటూ మెసేజ్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా తెరకెక్కుతుంది.