
తెలుగులో మీడియం బడ్జెట్ లో ప్రయోగాలు చేసే దర్శకుల్లో విఐ ఆనంద్ ఒకరు. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత అల్లు శిరీష్ తో ఒక్క క్షణం తీసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఈ ఇయర్ మొదట్లో మాస్ మహరాజ్ రవితేజతో డిస్కో రాజా అంటూ మరో ప్రయత్నం చేసినా అది కూడా నిరాశపరచింది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఆనంద్ కు ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమాతో కూడా మరో కొత్త ప్రయోగం చేస్తున్నట్టు తెలుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుందట. నిఖిల్ తో హిట్టు కొట్టిన ఆనంద్ అల్లు శిరీష్, రవితేజలకు ఫ్లాప్ ఇచ్చాడు. మరి కళ్యాణ్ రామ్ తో అయినా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. 118 తో సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రాం ఎంతమంచి వాడవురా సినిమా చేశాడు కాని ఆ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.