
ఇప్పుడప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదని తక్కువ బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాలన్ని ఓటిటి బాట పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుండగా మరికొన్ని ఓటిటికే ఓటు వేస్తున్నాయి. అయితే నాని వి, రామ్ రెడ్ తో పాటుగా మరికొన్ని సినిమాలు ఓటిటి లో వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇక ఇదిలాఉంటే ఈ ఇయర్ ఎలాగు పెద్ద సినిమాలు రిలీజ్ కష్టమని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాగ్ ఈ సమ్మర్ కు రావాల్సి ఉన్నా అది కాస్త వాయిదా పడ్డది.
ఇక ఈ సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు. 2021 జనవరి 8న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఈ లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని తెలిసిందే. అయితే ట్రిపుల్ ఆర్ వదిలిన పొంగల్ సీజన్ ను చిరు ఆక్యుపై చేశాడని అన్నారు. కొరటాల శివతో చేస్తున్న ఆచార్య సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం తమ్ముడు కోసం అన్న త్యాగం చేశాడని తెలుస్తుంది. చిరు ఆచార్య 2021 సమ్మర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయట. మొత్తానికి వకీల్ సాబ్ అటు ఇటు కాకుండా వచ్చే ఏడాదికి వాయిదా పడటం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.