ఈసారి బిగ్ బాస్ 50 రోజులేనా.?

బిగ్ బాస్ సీజన్ 4 గురించి రోజుకో కొత్త వార్త బయటకు వస్తుంది. కరోనా వల్ల బిగ్ బాస్ నుండి కాల్ వచ్చినా సరే సెలబ్రిటీస్ స్పందించట్లేదని తెలుస్తుంది. అందుకే స్టార్ సెలబ్రిటీస్ కోసం భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి తీసుకుంటున్నారట. ఈసారి కంటెస్టంట్స్ గా వచ్చే సెలబ్రిటీస్ సంఖ్య చాలా పెద్దగిగానే ఉంది. ఇదిలాఉంటే బిగ్ బాస్ సీజన్ 4 కేవలం 50 రోజులు మాత్రమే నిర్వహిస్తారని టాక్. అంతేకాదు ఈసారి హోస్ట్ గా స్టార్ హీరోయిన్ ఉండబోతుందని అంటున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఎన్.టి.ఆర్, సీజన్ 2 నాని, సీజన్ 3 కింగ్ నాగార్జున హోస్టులుగా చేశారు. అయితే సీజన్ 4కి ముందు ఎన్.టి.ఆర్ ఆతర్వాత నాగార్జున హోస్ట్ గా చేస్తారని అనుకోగా లేటెస్ట్ టాక్ ప్రకారం అక్కినేని కోడలు సమంత బిగ్ బాస్ హోస్ట్ గా సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఈసారి కంటెస్టంట్స్ కూడా 12 కంటెస్టంట్స్ ఉంటారని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 4 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంతకీ వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్న విషయాలు తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.