
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో అల్లు వెంకటేష్ అలియాస్ బాబి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ కన్ ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకు బాక్సర్, ఫైటర్ అనే టైటిల్స్ పరిశీలణలో ఉన్నాయి. అయితే పూరి డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించే సినిమా కూడా బాక్సింగ్ కథతో వస్తుందట. పూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆ సినిమాకు ఫైటర్, బాక్సర్ రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించుకుని ఉన్నాడట.
ఇప్పుడు విజయ్ సినిమా ఏ టైటిల్ పెడితే అదికాకుండా మిగిలిన టైటిల్ ను పూరిని అడిగి వరుణ్ తేజ్ సినిమాకు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఆ సినిమా దర్శక నిర్మాతలు. వరుణ్ తేజ్ అయితే బాక్సింగ్ కోసం బాగా కష్టపడ్డాడు. అందుకే అతని సినిమాకు బాక్సర్ అనే టైటిల్ అయితేనే పర్ఫెక్ట్ అని అంటున్నారు. ఇప్పటికే 40 శాతం పూర్తైన ఈ సినిమా మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉ ంది.