మహేష్ మూవీ ఛాన్స్ అందుకుందా..?

పరశురాం డైరక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ సినిమాగా సర్కారు వారి పాట తెరకెక్కనుంది. సెప్టెంబర్ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్తుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో ఇప్పటికే కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుండగా ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా మళయాళ భామ నివేదా థామస్ సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేదా థామస్ అభినయతారగా మెప్పిస్తుంది. 

తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న నివేదా థామస్ ఇప్పుడు సూపర్ స్టార్ ఛాన్స్ కూడా అందుకోవడం లక్కీ అని చెప్పొచ్చు. కీర్తి సురేష్, నివేదా థామస్ ఇద్దరు పోటీపడి మరి నటించే భామలే.. మరి సర్కారు వారి పాటలో మహేష్ కాకుండా వీరిద్దరు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది.