
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తాడు. పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ పెట్టుకుని తన సినిమాలు తానే నిర్మిస్తున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా అనీల్ పాడూరి డైరక్షన్ లో పూరి నిర్మాతగా రొమాంటిక్ సినిమా సెట్స్ మీద ఉంది. ఆ సినిమాలో పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్నాడు.
ఇక డబ్ స్మాష్ స్టార్ కెతిక శర్మ రొమాంటిక్ మూవీలో ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. అసలైతే సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసిన రొమాంటిక్ మూవీ కరోనా వల్ల రిలీజ్ చేయడం కుదరలేదు. ఇక రోజు రోజుకి పెరుగుతున్న్న కరోనా కేసులు చూస్తుంటే ఇప్పుడప్పుడే థియేటర్లు ఓపెన్ చేయడం కూడా కష్టమని తెలుస్తుంది. అందుకే రొమాంటిక్ సినిమాను ఓటిటి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. రొమాంటిక్ మూవీకి ఇప్పటికే ఓటిటి నుండి క్రేజీ ఆఫర్స్ వచ్చాయట. త్వరలోనే ఈ సినిమా డీల్ క్లోజ్ అవుతుందని అంటున్నారు. మరి ఆకాష్ పూరి, కెతిక శర్మల రొమాంటిక్ డిజిటల్ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.