
పెళ్లి తర్వాత కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గని విధంగా సినిమాలు చేస్తున్న అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం కెరియర్ లో ఆచితూచి స్క్రిప్ట్ లు ఎంచుకుంటుందని తెలుస్తుంది. మజిలీ, ఓ బేబీ హిట్లు పడ్డాక తెలుగులో ఆమె మరో సినిమా సైన్ చేయలేదు. అయితే కోలీవుడ్ మాత్రం విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో సినిమా చేస్తుందని తెలుస్తుంది. ఆ సినిమాలో సమంతతో పాటుగా నయనతర కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఆ సినిమాకు ఇంతకుముందు రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయగా కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్ధిక సమస్యలకు ప్రొడక్షన్ మీద ఎక్కువ బర్డెన్ పడకూడదని సమంత రెమ్యునరేషన్ తగ్గించుకున్నదని అంటున్నారు. ఇది ఓ విధంగా మంచి పరిణామమని చెప్పొచ్చు.. కొందరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిర్మాత కష్టాలు పడితే పడ్డాడు తమకు రావాల్సింది ముక్కుపిండి వసూళు చేస్తారు కాని సమంత మాత్రం ఆ విషయంలో తన మంచి హృదయాన్ని చాటుకుంది. ఎలాగు ప్రియుడు విఘ్నేష్ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి నయన్ కూడా పెద్దగా డిమాండ్ చేసే ఛాన్స్ లేదు. సో ఓవిధంగా ఇద్దరు టాప్ హీరోయిన్స్ తో విఘ్నేష్ క్రేజీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు.