పూరితో వెబ్ సీరీస్.. యువి క్రియేషన్స్ క్రేజీ అటెంప్ట్..!

ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత పూరి జనగణమన సినిమా చేస్తానని ఇప్పటికే ఎనౌన్స్ చేశాడు. ఆ సినిమాను మహేష్ తో చేయాలని అనుకున్నాడు పూరి మరి మహేష్ తోనే అది చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే పూరితో యువి క్రియేషన్స్ వారు ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట.

సినిమానే తక్కువ టైం లో మడతపెట్టే పూరి వెబ్ సీరీస్ అయితే వన్ వీక్ లో తీసినా తీసేస్తాడు. పూరితో క్రేజీ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట యువి వారు. తనకు ఓ బడ్జెట్ ఇచ్చి నచ్చిన నటులు.. నచ్చిన కథతో వెబ్ సీరీస్ చేయమన్నారట. తనకు ఫ్రీడం ఇస్తే దుమ్ముదులిపేసే పూరి ఈ రేంజ్ ఆఫర్ ఇస్తే ఇక చెలరేగిపోవడం ఖాయం. మరి పూరి నిజంగానే వెబ్ సీరీస్ చేస్తాడా.. ఒకవేళ చేస్తే అది ఎలా ఉంటుంది అన్న విషయాల మీద కొద్దిరోజుల్లో అప్డేట్ వస్తుంది.