హీరోయిన్ పూర్ణపై వేధింపులు.. నలుగురు అరెస్ట్..!

ఈమధ్య సోషల్ మీడియాలో కొందరు సెలబ్రిటీస్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం.. ఎలాగోలా వారి ఫోన్ నంబర్స్ కనుక్కొని వాళ్లను హెరాస్ చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ గా అలాంటి వేధింపులకు గురై సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది హీరోయిన్ పూర్ణ. తనని ఫోన్ లో వేధిస్తున్నారని.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆమె కేసు వేయడం జరిగింది. అయితే వెంటనే రంగంలో దిగిన పోలీసులు ఆమెను హరీస్ చేస్తున్న వారిని పట్టుకోవడం విశేషం.

బెంగుళూరులో ఉంటున్న నలుగురు వ్యక్తులు పూర్ణని ఫోన్ లో బెదిరిస్తున్నారని తేలింది. బెంగుళూరు పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారని తెలుస్తుంది. శరత్, అష్రఫ్, రఫీజ్, రమేష్ లు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇదివరకు కూడా ఈ నలుగురు ఇలాంటి పనులకు పాల్పడినట్టు గుర్తించారు. మహిళలను, స్టూడెంట్స్ ను వేధించినట్టుగా వారి మీద ఇదివరకే కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పుడు పూర్ణ కేసులో వారిని మరోసారి పట్టుకోవడం జరిగింది.. వాళ్ల మీద సీరియస్ యాక్షన్ తీసుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నారని సమాచారం.