చైతు, సమంతలకు కరోనా రాలేదు..!

టైటిల్ చూసి కాస్త కన్ ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉన్నా.. గత రెండు రోజులుగా మీడియాలో నాగ చైతన్య, సమంతలకు కూడా కరోనా వచ్చే ఛాన్సులు ఉన్నట్టు వార్తలు రాగా తమ క్లోక్ సర్కిల్స్ తో ఆ వార్తలను ఖండించారు ఈ స్టార్ జోడీ. సమంత స్నేహితురాలు శిల్పా రెడ్డికి కరోనా పాజిటివ్ రావడం ఆమెతో రెండు వారాల క్రితం ముద్దుపెడుతూ సమంత కనిపించడంతో సమంతకు కూడా కరోనా వచ్చిందని.. చైతు, సమంత కరోనా వల్లే హోం క్వారెంటైన్ లో ఉన్నారని వార్తలు రాయడం మొదలుపెట్టారు.

ఈ వార్తలు చైతు, సమంతల దాకా చేరడంతో వాళ్లు మీడియా మీద ఫైర్ అవుతున్నారు. ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా ఇలాంటి విషయాల గురించి వార్తలెలా రాస్తారంటూ సీరియస్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే చైతు లవ్ స్టోరీ దాదాపు ముగింపు దశకు చేరుకోగా షూటింగ్ స్టార్ట్ అయితే మరో షెడ్యూల్ లో సినిమా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు శేఖర్ కమ్ముల. ఇక సమంత మాత్రం ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ సీక్వల్ లో నటించింది. ఈమధ్యనే ఓ నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఓకే చెప్పిందని టాక్.