RRR టెస్ట్ షూట్ క్యాన్సిల్

కరోనా ప్రభావం ఎలా ఉన్నా సినిమా షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణా ప్రభుత్వం. ఆంక్షలతో కూడిన షూటింగ్ నిర్వహించాలని చెప్పారు. అయితే ఇప్పటికే బుల్లితెర నటుడు ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని సీరియల్స్ షూటింగ్స్ ఆపేయడం జరిగిందట. ఇక ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ టెస్ట్ షూట్ కూడా క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల 25, 26 తేడీలలో ఆర్.ఆర్.ఆర్ టెస్ట్ షూట్ జరపాలని అనుకున్నాడు రాజమౌళి. 

కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుండటం వల్ల టెస్ట్ షూటింగ్ కు పాల్గొనడం కష్టమని చెప్పారట ఎన్.టి.ఆర్, రాం చరణ్. అందుకే ఈరోజు రేపు జరపాల్సిన టెస్ట్ షూట్ కాస్త క్యాన్న్సిల్ అయినట్టు తెలుస్తుంది. టెస్ట్ షూట్ కే స్టార్స్ నో చెప్పారు అంటే వాళ్లిక ఇప్పుడప్పుడే షూటింగ్స్ కు రెడీ అయ్యే ఛాన్స్ లేదు. 2021 జనవరి 8న రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రయూనిట్ చూస్తుంటే 2021 చివర్లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.