
సూపర్ స్టార్ మహేష్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. ఇప్పటికే తను నటించే సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా ఉంటూ వస్తున్న మహేష్ సోలో నిర్మాతగా మారి అడివి శేష్ తో మేజర్ సినిమా చేస్తున్నాడు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో వస్తున్న ఈ సినిమాలో రేణు దేశాయ్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మాజి భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈమధ్య బుల్లితెర మీద ప్రత్యక్షమైన రేణు దేశాయ్ అడివి శేష్ మేజర్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది.
అకిరా నందన్ కు అడివి శేష్ అంటే ప్రత్యేకమైన అభిమానం.. అందుకే రేణు దేశాయ్ ను ఈ పాత్ర కోసం అడగగానే ఒప్పేసుకుందని తెలుస్తుంది. సినిమాలో రేణు దేశాయ్ రోల్ ఒక 20 నిమిషాలు ఉండొచ్చని అంటున్నారు. మరి రేణు దేశాయ్ మేజర్ సినిమాలో నటించడం గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. సగానికి పైగా పూర్తైన మేజర్ సినిమా అసలైతే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి అనుకున్నవిధంగా ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందో లేదో చూడాలి.