
జబర్దస్త్ షో మళ్లీ స్టార్ట్ అయ్యింది.. ప్రోమోతో కామెడీ సందడి మొదలైందని హడావిడి చేస్తున్నారు. బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ కామెడీ షోగా జబర్దస్త్ అదరగొడుతుంది. ఈ షోలో అనతికాలంలో స్టార్ కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు హైపర్ ఆది. పవర్ స్టార్ వీరాభిమానైన ఆది పవన్ ను కాని మెగా ఫ్యామిలీని కాని ఎవరైనా టార్గెట్ చేస్తే చాలు వారి మీద తన స్కిట్ లో పంచులతో టార్గెట్ చేస్తాడు. లేటెస్ట్ గా ప్రోమోలో బాలయ్య మీద హైపార్ ఆది పంచ్ వేశాడు.
తన స్కిట్ లో కావాలని టార్గెట్ చేసి పంచులేయడం ఆదికి అలవాటే. రీసెంట్ గా బాలకృష్ణ బిబి3 ఫస్ట్ లుక్ టీజర్ లో ఆయన చెప్పిన డైలాగ్ ను ఆది మార్చి చెబుతూ బాలయ్యపై పంచ్ వేశాడు. చాలాసార్లు బాలకృష్ణ మీద తన సెటైరికల్ పంచులు వేస్తూ మెగా అభిమానం చూపించిన ఆది కొత్తగా వేసిన ఈ జబర్దస్త్ పంచ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.