రాశి ఖన్నా కూడా హ్యాండ్ ఇచ్చిందా..!

సింహా, లెజెండ్ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ బిబి-3 ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మొదటి రెండు సినిమాలు కాదు ఈ సినిమాతో అంతకుమించి బ్లాక్ బస్టర్ ను టార్గెట్ పెట్టుకున్నట్టు ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అయితే వచ్చింది కాని హీరోయిన్ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈమధ్య సౌత్ క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను అడిగితే ఆమె చేయనని చెప్పిందట.  

లేటెస్ట్ గా రాశి ఖన్నాని కూడా బిబి-3 కోసం అడిగారట. ఆమె కూడా వెటరన్ హీరోలతో నటించడానికి సుముఖంగా లేదని తెలుస్తుంది. అందుకే ఆ ఆఫర్ ను మిస్ చేసుకుందని తెలుస్తుంది. రాశి ఖన్నా కూడా కాదని చెప్పేసరికి ఫైనల్ గా అంజలిని ఓకే చేసినట్టు తెలుస్తుంది. బిబి-3 హిట్టు పడితే మాత్రం కాజల్, రాశి ఖన్నా మంచి ఛాన్స్ మిస్సయ్యారని ఫీల్ అవక తప్పదు.