
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తాడన్న వార్తలు వచ్చాయి. చిరు, చరణ్ ఇద్దరిని ఒకే సినిమాలో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నారు. అయితే చరణ్ కోసం అనుకున్న పాత్రలో ముందు మహేష్ బాబు చేస్తాడని వార్తలు వచ్చాయి.
అయితే ఏమైందో ఏమో మహేష్ ఆ పాత్ర చేసేందుకు ఇంట్రెస్ట్ చూపలేదట. ఇక ఆ తర్వాత రాం చరణ్ ఆ రోల్ లో నటించడానికి ఓకే అన్నాడు. అయితే ఇప్పుడు చరణ్ కూడా నటించడం గ్యారెంటీ లేదన్నట్టు తెలుస్తుంది. ఓ బలమైన అది కూడా సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాబట్టి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కావాలని చూస్తున్నాడు కొరటాల శివ. మహేష్ చేయడం కుదరలేదు చరణ్ అయినా చేస్తాడేమో అనుకుంటే ఆయన కూడా ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేసే పనిలో బిజీగా మారాడు. మరి ఆ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.