
కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ లో ఆడియెన్స్ అంతా సినిమాలకు చాలా దూరమయ్యారు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు అన్న దాని మీద క్లారిటీ రాలేదు. ఇప్పుడిప్పుడే టివి సీరియల్స్, షోస్ స్టార్ట్ అవుతున్నాయి. లాక్ డౌన్ వల్ల ఓటిటి ఫ్లాట్ ఫాం బాగా క్లిక్ అయ్యింది. ఈ మూడు నెలలు డిజిటల్ ఫ్లాట్ ఫాం భారీ సబ్ స్క్రైబర్స్ తో మంచి బిజినెస్ చేసింది. అందుకే ఇప్పుడు స్టార్స్ కూడా ఓటిటి వైపు చూస్తున్నారు.
సినిమా అయితే అవి ఇవి కావాలి కాని వెబ్ మూవీ, వెబ్ సీరీస్ అయితే ఇవన్ని ఏమి అవసరం లేదు. అందుకే టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ సైతం ఓటిటికి ఓటేస్తున్నారు. ఇక ఇదే బాటలో స్టార్ డైరక్టర్ గుణశేఖర్ కూడా వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అసలైతే రానా హీరోగా హిరణ్యకశ్యప సినిమా చేయాల్సిన గుణశేఖర్ ఆ సినిమాని ప్రస్తుతం హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. మరి గుణశేఖర్ నిజంగానే వెబ్ సీరీస్ చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.