
నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా టాలెంట్ చూపిన రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా శ్యాం సింగ రాయ్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అవసరం ఉండగా ఒక హీరోయిన్ గా సాయి పల్లవి సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే మిగతా ఇద్దరు హీరోయిన్స్ లో రష్మిక కూడా చేస్తుందని వార్తలు వచ్చాయి. కాని సాయి పల్లవి చేస్తున్నందుకు రష్మిక ఈ సినిమాను చేయనని చెప్పిందట.
అదేంటి సాయి పల్లవి చేస్తే రష్మిక ఎందుకు చేయనని చెప్పిందని డౌట్ రావొచ్చు. ఒక ఇమేజ్ వచ్చాక హీరోయిన్స్ తమ సాటి హీరోయిన్స్ తో ఈక్వల్ రోల్స్ కావాలని ఆశిస్తారు. మరి దర్శకుడు చెప్పిన కథలో సాయి పల్లవి రోల్ నచ్చి.. తన రోల్ కొద్దిగా తక్కువ అనిపించిందో ఏమో కాని సాయి పల్లవి వల్ల రష్మిక ఆ సినిమా ఆఫర్ మిస్ చేసుకుందట. ప్రస్తుతం తెలుగులో పుష్పతో పాటుగా తమిళంలో తుపాకి సీక్వల్ లో కూడా ఛాన్స్ అందుకున్న రష్మిక భాషతో సంబంధం లేకుండా సౌత్ లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది.