
3 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు.. నాల్గవ సీజన్ కు రెడీ అవుతుంది. 3వ సీజన్ హోస్ట్ గా చేసిన కింగ్ నాగార్జుననే రాబోయే 4వ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే ఆ అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేశారట. ప్రస్తుతం హౌజ్ లో కంటెస్టంట్స్ కోసం వేట మొదలుపెట్టారట. ఇప్పటికే చాలావరకు కంటెస్టంట్స్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.
మొదటి రెండు, మూడు సీజన్లలో మిగిలిన కంటెస్టంట్స్ తో పాటుగా ఈమధ్య పాపులర్ అయిన వారికు బిగ్ బాస్ ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో బిత్తిరి సత్తి స్టార్ కంటెస్టంట్ గా వస్తాడని అంటున్నారు. తీన్మార్ వార్తలతో బాగా పాపులర్ అయిన బిత్తిరి సత్తి వ్6 నుండి టివి9కి రాగా అక్కడ ఇస్మార్ట్ న్యూస్ అని ప్రోగ్రాం చేస్తున్నాడు. లేటెస్ట్ గా టివి9 నుండి కూడా అతన్ని తొలగించినట్టు తెలుస్తుంది. మేనేజ్మెంట్ ను లెక్కచేయని విధంగా బిత్తిరి సత్తి అలియాస్ చెవెల్ల రవి కుమార్ ప్రవర్తన ఉండటంతో అతన్ని టివి9 నుండి తీసేశారని తెలుస్తుంది.