నా రాత నేను రాసుకుంటానంటున్న నాగార్జున..!

ఆఫీసర్, మన్మధుడు 2 సినిమాలు ఫ్లాప్ అవడంతో కొద్దిపాటి గ్యాప్ తో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు నాగార్జున. సోలమన్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాగార్జున ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో నాగ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ఇంతకీ ప్రవీణ్ తో నాగ్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ఏంటంటే.. నా రాత నేను రాసుకుంటా అని అంటున్నారు. ఈ మూవీ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు అయినా కూడా టైటిల్ పై వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మరి ఇంతకీ నాగార్జున టైటిల్ అదేనా కాదా అని తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.