కీర్తి నువ్వు సూపరంతే..!

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరక్టర్ కార్తిక్ సుబ్బరాజు నిర్మాణంలో ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేసిన సినిమా పెంగ్విన్. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 19న అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమాకు మిక్సెడ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల కన్నా ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ మాత్రం కీర్తి సురేష్ ను పొగిడేస్తున్నారు.

ఆ లిస్ట్ లో ఇప్పుడు కన్నడ భామ రష్మిక మందన్న చేరింది. రాత్రి పెంగ్విన్ సినిమా చూశానని ఎప్పటిలానే కీర్తి నీ అభినయం అద్భుతం. ఈ సినిమాకు నువ్వే కీలకం.. ఈశ్వర్, సుబ్బరాజు సర్ చిత్రయూనిట్ అందరికి అభినందనలు అంటూ కామెంట్ పెట్టింది. ఓ స్టార్ హీరోయిన్ సినిమా చూసి మరో స్టార్ హీరోయిన్ ఇలా స్పందించడం చాలా అరుదు. పెంగ్విన్ సినిమాపై రష్మిక ఇచ్చిన ఈ రివ్యూపై నెటిజెన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.