త్వరలోనే 'జనగణమన'

పూరి మహేష్ కాంబోలో వచ్చిన పోకిరి, బిజినెస్ మెన్ రెండు సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. పోకిరి ఇండస్ట్రీ రికార్డులు కొట్టగా.. బిజినెస్ మెన్ మాస్ ఆడియెన్స్ ను మెప్పించాడు. మహేష్ తో హ్యాట్రిక్ మూవీగా జనగణమన స్క్రిప్ట్ రాసుకుని పెట్టుకున్నాడు పూరి. కాకపోతే టెంపర్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ వరకు వరుస ఫ్లాపులు తీసిన పూరితో సినిమా అంటే వెనుకడుగు వేశాడు మహేష్. ఆ టైం లోనే మహేష్ కేవలం హిట్ డైరక్టర్స్ కు ఛాన్సులు ఇస్తాడని హాట్ కామెంట్స్ చేశాడు పూరి. అయితే దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు మహేష్.

ఈమధ్య ఫ్యాన్స్ తో చాట్ చేయగా పూరి జనగణమన చేయమని మహేష్ ను కోరారు ఫ్యాన్స్. పూరి వస్తే నేను రెడీ అన్నట్టు చెప్పాడు మహేష్. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నెక్స్ట్ జనగణమన చేస్తాడని తెలుస్తుంది. విజయ్ సినిమా పాన్ ఇండియా చేస్తుండగా.. మహేష్ తో చేసే జనగణమన కూడా నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తాడని తెలుస్తుంది. మొత్తానికి ఇన్నాళ్ల మహేష్ ఫ్యాన్స్ కల నెరవేరబోతుందని సంతోషంగా ఉన్నారు.