
మాస్ మహరాజ్ రవితేజ ఈమధ్య కెరియర్ లో తన దూకుడు చూపించడంలో వెనుకపడ్డాడు. రాజా ది గ్రేట్ హిట్ తర్వాత హిట్టు కొట్టడం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ ఇయర్ వచ్చిన డిస్కో రాజా రిలీజ్ ముందు హడావిడి బాగా చేసినా ఆఫ్టర్ రిలీజ్ మాత్రం నిరాశపరచింది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో రవితేజ, రానా కలిసి చేస్తారని వార్తలు వచ్చాయి.
హరీష్ శంకర్ డైరక్షన్ లో ఈ సూపర్ హిట్ రీమేక్ సెట్స్ మీదకు వెళ్తుందని అన్నారు. అయితే రవితేజ మాత్రం ఆ సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదని టాక్. రవితేజ, రానాలు ఆ రీమేక్ కోసం ఎక్కువ డేట్స్ అడ్జెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాని రవితేజ మాత్రం అందుకు సిద్ధంగా లేడని అంటున్నారు. అంతేకాదు ఆ సినిమాకు భారీగా రెమ్యునరేష అడుగుతున్నాడట. అందుకే అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో రవితేజ నటించే ఛాన్స్ లేదని అంటున్నారు. మరి రవితేజ బదులుగా ఎవరు ఆ సినిమా చేస్తారో తెలియాల్సి ఉంది.