
కొన్నాళ్లుగా కెరియర్ లో సక్సెస్ లేక వెనుకపడ్డ గోపిచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సినిమా సీటిమార్. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న గోపిచంద్ కథల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు. ఈమధ్య వచ్చిన చాణక్య సినిమా కూడా అతన్ని నిరాశపరచింది. అందుకే కొద్దిపాటి గ్యాప్ తో సీటిమార్ అంటూ రాబోతుతున్నాడు గోపిచంద్. ఈ సినిమాతో దర్శకుడిగా వెనుకపడ్డ సంపత్ నంది కూడా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.
అయితే కేవలం హీరో గోపిచంద్, డైరక్టర్ సంపత్ నంది మాత్రమే కాదు ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేస్తున్న సునీల్ కూడా మళ్లీ తన మునుపటి ఫాంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. సీటిమార్ లో సునీల్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. ఈ సినిమాతో మళ్లీ కెరియర్ లో బిజీ అవ్వాలని చూస్తున్నాడు సునీల్. కమెడియన్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. హీరోగా చేస్తుంటే ఉన్న క్రేజ్ కూడా పోయేలా ఉందని మళ్లీ అరవింద సమేత సినిమాతో కమెడియన్ గా టర్న్ అయ్యాడు. సీటిమార్ సినిమాలో సునీల్ కూడా అలరిస్తాడని అంటున్నారు. మరి ఈ ముగ్గురికి ప్రత్యేకమైన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.