ప్రభాస్ 20.. హాస్పిటల్ సెట్ కు అంత ఖర్చా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. రాధే శ్యామ్ టైటిల్ పరిశీలణలో ఉన్న ఈ సినిమా కోసం ఫిల్మ్ సిటీలో ఓ భారీ హాస్పిటల్ సెట్ వేస్తున్నారని తెలుస్తుంది. ఈ సెట్ ఖర్చు దాదాపు 5 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది.

ఇప్పటికే సినిమా సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకోగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. ఆ స్క్రిప్ట్ కూడా పూర్తి కాగా వచ్చే ఏడాది ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది.