
సూపర్ స్టార్ మహేష్, పరశురామ్ కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా రాబోతున్న సినిమా సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా సుదీప్, ఉపేంద్ర లాంటి స్టార్స్ నటిస్తారని అన్నారు. కాని దర్శక నిర్మాతలు ఫైనల్ గా కోలీవుడ్ స్టార్ హీరో కమ్ విలన్ అరవింద్ స్వామిని ఫిక్స్ చేశారట.
హీరోగా తమిళ పరిశ్రమలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అరవింద్ స్వామి కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ విలన్ గా సత్తా చాటుతున్నాడు. తని ఒరువన్ తెలుగు రీమేక్ గా వచ్చిన ధృవ సినిమాలో కూడా అరవింద స్వామి విలన్ గా చేశాడు. ఇక ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాట సినిమాలో కూడా అతను విలన్ గా కన్ఫర్మ్ చేశారట. మరి ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేయాల్సి ఉంది. సినిమాలో విలన్ గా అరవింద స్వామి కన్ఫర్మ్ అయితే సర్కారు వారి పాట సినిమాలో విలన్ కూడా మహేష్ అంత అందంగా ఉండేలా చేస్తున్నాడు అంటే సబ్జెక్ట్ ఎలా ఉండబోతుందో అన్న అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.