ఈసారి క్రైం డ్రామాతో సందీప్ వంగ..!

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా ఏంటో చూపించిన సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. కబీర్ సింగ్ అక్కడ హిట్ అవడంతో బాలీవుడ్ నిర్మతలు కూడా అతని డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నారు. రణ్ బీర్ కపూర్ తో సందీప్ వంగ సినిమా అని వార్తలు రాగా ఆ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. ఇక లేటెస్ట్ గా సందీప్ వంగ నెక్స్ట్ సినిమా క్రైం డ్రామాగా ఉండబోతుందని తెలుస్తుంది.

తెలుగు, హింది భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమా కథ సిద్ధం చేసిన సందీప్ వంగ తన స్క్రిప్ట్ కు తగిన హీరో కోసం వెతుకుతున్నాడని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన సందీప్ వంగ ఈసారి తన క్రైం డ్రామా కథతో వస్తున్నాడు. తను ఎంచుకున్న కథలో దీప్ గా వెళ్లే సందీప్ వంగ ఈ క్రైం డ్రామాని ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.