
పూరి జగన్నాథ్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా దేశముదురు. ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ హాన్సిక. అప్పటివరకు మొడల్ గా ఉన్న అమ్మడు ఆ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయమై తన సత్తా చాటింది. తెలుగులో స్టార్ క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉన్నా తమిళ పరిశ్రమ మీద ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు లేటెస్ట్ అక్కడ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది.
కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లో కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హాన్సిక ఇప్పుడు వెబ్ సీరీస్ లను చేసేందుకు సై అంటుందట. ఈమధ్య హీరోయిన్స్ అందరు వెబ్ సీరీస్ ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెండితెర మీద అవకాశాలు తగ్గిన భామలంతా కూడా వెబ్ సీరీస్, ఓటిటి మూవీస్ లలో నటించేందుకు ఓకే అంటున్నారు. ఈ కోవలోనే హాన్సిక కూడా వెబ్ సీరీస్ కు సైన్ చేసిందట.
అప్పుడెప్పుడో పిల్ల జమిందార్ సినిమా చేసిన అశోక్ ఈమధ్యనే అనుష్కతో భాగమతి సినిమా చేసి హిట్టు కొట్టాడు. ఆ డైరక్టర్ చేస్తున్న ఓ వెబ్ సీరీస్ లో హాన్సిక నటిస్తుందని తెలుస్తుంది. ప్రముఖ ఓటిటి సంస్థ ఈ వెబ్ సీరీస్ నిర్మిస్తుందని తెలుస్తుంది. భాగమతితో దర్శకుడిగా తన సత్తా చాటిన అశోక్ ఈ వెబ్ సీరీస్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తాడని చెప్పొచ్చు.