
కన్నడ భామ రష్మిక మందన్న కెరియర్ ఫుల్ జోష్ లో ఉందని చెప్పొచ్చు. కిరాక్ పార్టీ సినిమాతో కన్నడలో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన రష్మిక తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవడం ఆ వెంటనే చేసిన గీతా గోవిందం సూపర్ హిట్ అవడంతో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యింది. తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా వరుస ఛాన్సులు అందుకుంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుందని తెలుస్తుంది.
ఇప్పటికే తెలుగులో స్టార్ ఛాన్సులు అందుకుంటున్న రష్మిక కోలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తుంది. ఇప్పటికే కార్తి హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక లేటెస్ట్ గా ఇళయదళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ పట్టేసిందట. మురుగదాస్ డైరక్షన్ లో విజయ్ హీరోగా వస్తున్న హ్యాట్రిక్ మూవీ తుపాకి సీక్వల్ గా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో మొదట కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు రాగా ఆమె ప్లేస్ లో రష్మిక వచ్చి చేరింది. ప్రస్తుతం యూత్ లో సూపర్ క్రేజ్ ఉన్న రష్మిక అయితే సినిమాకు అదనపు ఆకర్షణగా ఉంటుందని తుపాకి 2లో ఆమెను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.