దేవరకొండ ఏం చేసినా రచ్చే..!

రౌడీ హీరో అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. దాదాపు స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మూవీలో విజయ్ దేవరకొండతో అనన్య పాండే రొమాన్స్ చేస్తుంది.

ముంబైలో మొదలైన ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తి కాగా కరోనా వల్ల షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. అయితే ఇప్పటివరకు చేసిన షూటింగ్ లో విజయ్ ఎలా ఉన్నాడో కాని లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ లుక్ రివీల్ అయ్యింది. జూన్ 21 ఫాదర్స్ డే సందర్భంగా ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేశాడు విజయ్. అందులో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించాడు. విజయ్ అలా డిఫరెంట్ లుక్ లో కనిపించాడో లేదో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పోకిరి సినిమాలో ఆలి భాయ్ అసిస్టెంట్ గా ఉన్నాడని కొందరు.. అది అతని బయోపిక్ అని మరికొందరు ఇలా కామెంట్స్ తో హంగామా చేస్తున్నారు. టాలీవుడ్ లో ఏదైనా కొత్తగా చేయాలంటే విజయ్ తర్వాతే ఎవరైనా అనేలా తన క్రేజ్ పెంచుకుంటున్నాడు.