
సాహో తర్వాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. పిరియాడికల్ మూవీగా రాబోయే ఈ సినిమాకు టైటిల్ ఏంటన్నది కొన్నాళ్లుగా మీడియాలో హాట్ న్యూస్ నడుస్తుంది. రాధే శ్యామ్ టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ వార్తలు వచ్చాయి.
ఇప్పుడు చిత్రయూనిట్ కూడా అదే టైటిల్ ఫైనల్ చేస్నట్టు తెలుస్తుంది. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాపై ఎలాంటి అప్డేట్స్ లేకపోయేసరికి ఫ్యాన్స్ చిత్రయూనిట్ పై విమర్శలు చేస్తున్నారు. ప్రభాస్ రంగంలోకి దిగి కొద్దిగా వెయిట్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. ఇక సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా త్వరలో వస్తాయని హామి ఇచ్చాడు. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే రోజు దగ్గరలోనే ఉందని చెప్పొచ్చు. సాహో అంచనాలను అందుకోకపోయినా రాబోయే సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.