ట్రిపుల్ ఆర్ కోసం అతనికి అంత ఇస్తున్నారా..?

బాహుబలి తర్వాత రాజమౌళి ఈసారి పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ అంటూ ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న జక్కన్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లను కలిపి ఒకే స్క్రీన్ పై చూపిస్తున్నాడు. సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. సినిమాలో వీళ్లే కాకుండా అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారని తెలిసిందే. 

ట్రిపుల్ ఆర్ లో కోలీవుడ్ డైరక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖనికి మంచి పాత్ర దక్కిందట. సినిమాలో అతను నటిస్తున్నందుకు గాను 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. రెమ్యునరేషన్ ను బట్టి చూస్తే సముద్రఖని పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో అజయ్ దేవగ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా సినిమా బాలీవుడ్ లో రిలీజైన తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటారని తెలుస్తుది. ఇక ఈ మూవీలో హీరోయిన్స్ గా అలియా భట్, ఓలివియా మోరిస్ లు నటిస్తున్నారు. 2021 జనవరి 8న రిలీజ్ అనుకున్న ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.