
మళయాళ భామ కీర్తి సురేష్ కెరియర్ మంచి ఫాంలో దూసుకెళ్తున్నా టాలీవుడ్ లో మాత్రం వచ్చిన క్రేజీ ఆఫర్స్ ను కాలదన్నుకుంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా సినిమా చేస్తున్న కీర్తి సురేష్ లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబోలో తెరకెక్కే సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించడం స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు.
అయితే మహేష్ కు ఓకే చెప్పిన కీర్తి సురేష్ మెగా హీరోల సినిమాలకు మాత్రం షాక్ ఇచ్చిందట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వేణు శ్రీరాం కాంబినేసన్ లో ఐకాన్ సినిమా ఎనౌన్స్ చేశారు. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండగా విలేజ్ లో ఉండే హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ ను అడిగారట.. అయితే స్టోరీ విన్న కీర్తి సురేష్ ఆ పాత్రతో హీరో రొమాన్స్ ఎక్కువ ఉందని సినిమా చేయనని చెప్పిందట. ఇక మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో కూడా కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోగా ఆమె మాత్రం కుదరదని చెప్పిందట. డేట్స్ అడ్జెస్ట్ అవ్వకనే చెప్పిందో లేక మరే కారణమో కాని మెగా హీరోల సినిమాలంటే మాత్రం కీర్తి సురేష్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదని ఇన్నర్ టాక్.