ఆరుడగుల బుల్లెట్ కి ఓటిటి దిక్కైంది..!

రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు చూస్తుంటే ఇప్పుడప్పుడే సినిమా థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం లేదని అనిపిస్తుంది. ఒకవేళ అన్ లాక్ 2.ఓ లో థియేటర్స్ ఓపెన్ చేసినా సరే జనాలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ఛాన్స్ తక్కువ. అందుకే మీడియం, మినిమం బడ్జెట్ సినిమాలు ఓటిటి రిలీజ్ కు ఓకే చేస్తున్నారు. ఇదిలాఉంటే ఆల్రెడీ రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాలు కూడా ఓటిటికి మొగ్గుచూపుతున్నాయి.

ఈ కోవలోనే ఒకప్పుడు స్టార్ డైరక్టర్ బి.గోపాల్ డైరక్షన్ లో.. మాస్ హీరో గోపిచంద్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా ఆరడుగుల బుల్లెట్. డైరక్టర్ గా ఫేడవుట్ అయిన గోపాల్ డైరక్షన్ లో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించారు. గోపిచంద్ కూడా అసలు ఈమధ్య పెద్దగా ఫాం లో లేడు. అయితే సినిమా కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. లాక్ డౌన్ లేకుంటే ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు మూగు చూపుతున్నారని తెలుస్తుంది.రెండేళ్ల క్రితం నుండి ఈ సినిమా రిలీజ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇప్పటికి  అది కూడా ఓటిటిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.  అప్పటి నుండి రిలీజ్ కు నోచుకోలేదు.. ఇప్పటికి ఏమాత్రం బజ్ లేని ఈ సినిమా ఓటిటిలో అయినా మంచి ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.