నిహారిక వెడ్స్ వెంకట చైతన్య

మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకునే అబ్బాయి ఎవరన్నది తెలిసిపోయింది. రీసెంట్ గా మిస్ నిహా కాస్త మిస్సెస్ అంటూ నిహారిక ఇచ్చిన హింట్ ఇవ్వడం.. ఒకతన్ని ఫేస్ రివీల్ చేయకుండా కౌగిలించుకోవడం లాంటివి చేసిన నిహారిక లేటెస్ట్ గా అతని పిక్స్ రివీల్ చేసింది. ఇంతకీ నిహారిక పెళ్లి చేసుకునే అబ్బాయి ఎవరు అంటే అతని పేరు వెకట చైతన్య జొన్నలగడ్డ. సాఫ్ట్ వేర్ ఎగ్జిక్యూటివ్ అయిన చైతన్య గుంటూరు ఐజి కుమారుడు అని తెలుస్తుంది.

త్వరలోనే కూతురు పెళ్లి అంటూ చెప్పుకుంటూ వచ్చిన నాగబాబు అనుకున్నట్టుగానే పోలీస్ ఆఫీసర్ ని వియ్యంకుడుగా చేసుకోబోతున్నాడు. నిహారిక తన వుడ్ బె పిక్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వాటికి మెగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మెగా ప్రిన్సెస్ కు తగిన ప్రిన్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఆగష్టులో వీరి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నారట.. డిసెంబర్ లో మ్యారెజ్ ఉంటుందని సమాచారం.