
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా ఇప్పటికి తనకు ఏదో ఒక అవార్డులు తెచ్చిపెడుతూనే ఉంది. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలిసేలా చేశారు. ప్రభాస్ కూడా ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ షో మెన్ రాజ్ కపూర్ తర్వాత అంతటి క్రేజీ అవార్డ్ అందుకున్నాడు ప్రభాస్.
బాహుబలి సినిమా రష్యాలో కూడా సూపర్ హిట్ అయ్యింది. అందుకే అ దేశానికి చెందిన ఓ ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కించుకున్నాడు ప్రభాస్. రష్యన్ ఆడియెన్స్ హార్ట్ అవార్డ్ ప్రభాస్ కు దక్కింది. 30 ఏళ్ల క్రితం బాలీవుడ్ హీరో రాజ్ కపూర్ ఈ అవార్డ్ అందుకున్నారు. 420, అవారా, ఆరాధన సినిమాలు రష్యన్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు బాహుబలితో ప్రభాస్ ఈ అవార్డ్ అందుకున్నారు. రాజ్ కపూర్ తర్వాత ఈ అవార్డ్ అందుకున్న ఇండియన్ హీరోగా ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది.