
ఎప్పుడూ బిజీగా ఉండే సినిమా సెలబ్రిటీస్ లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్ డౌన్ టైంలో కథానాయికలు తమ సొంత టాలెంట్ చూపించేస్తున్నారు. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ సడలింపులు జరుగుతున్నాయి. ఇక ఈ లాక్ డౌన్ టైంలో తాను చాలా చేశా అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. ఎక్కువ టైం దొరకడం వల్ల ఎక్కువసేపు జిమ్ చేశానని.. ఇక యూట్యూబ్ ఛానెల్ మీద కూడా దృష్టి పెట్టానని చెబుతున్న రకుల్ చదువు మీద ఇంట్రెస్ట్ రావడంతో ఆన్ లైన్ లో ఎంబిఏ కోర్స్ జాయిన్ అయ్యానని చెప్పింది.
కెరియర్ ఎలాగు డౌట్ గా ఉండటంతో తర్వాత ఎందుకైనా పనికొస్తుందని ఎంబిఏ కోర్స్ పూర్తి చేసే పనిలో ఉంది రకుల్. తెలుగులో నితిన్ సరసన ఒక ఆఫర్ ఉంది. ఆ సినిమా హిట్టైతే మళ్లీ ఇక్కడ మంచి ఛాన్సులు వస్తాయి. బాలీవుడ్ లో కూడా ఒకటి రెండు ఆఫర్లు ఉన్నట్టు తెలుస్తుంది. మరి అమ్మడు ఎంబిఏ పూర్తయ్యాక సినిమాలకు బై బై చెప్పి ఎంచక్కా ఉద్యోగం చేస్తుందేమో అననుకుంటున్నారు నెటిజెన్లు.