
స్టార్ హీరోలు, యువ హీరోలు ఎంతమంది వచ్చినా టాలీవుడ్ కింగ్ తానే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు యువ సామ్రాట్ కింగ్ నాగార్జున. ఆరుపదుల వయసు వచ్చినా ఇప్పటికి యువ హీరోలకు పోటీగా తన స్టైల్ మెయింటైన్ చేస్తున్న నాగార్జున ఖాతాలో మరో క్రేజీ రికార్డ్ వచ్చి చేరింది. ట్విట్టర్ లో స్టార్స్ కు పోటీగా తన ఫాలోయింగ్ ఏర్పరచుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు నాగార్జున.
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ 9 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ తో నంబర్ 1 పొజిషన్ లో ఉండగా ఆ తర్వాత 6 మిలియన్ ఫాలోవర్స్ క్రాస్ చేసి నాగార్జున సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాన్ మిగిలిన స్టార్స్ అంతా కూడా నాగార్జున తర్వాతే ఉన్నారు. తెలుగుతో పాటుగా తమిళ, హింది ఆడియెన్స్ ను వాణిజ్య ప్రకటనల ద్వారా అలరించే నాగార్జునకు ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉండటం కామనే. అయితే సీనియర్ స్టార్స్ లో ఎవరు అందుకోలేని ఈ రికార్డ్ ఫాలోవర్స్ కేవలం నాగార్జున వల్ల మాత్రమే అయ్యిందని చెప్పొచ్చు. మొత్తానికి తనయులిద్దరు హీరోలుగా నటిస్తున్నా తన రేంజ్ ఇంకా తగ్గలేదని నాగ్ మరోసారి ప్రూవ్ చేశాడు.